janathamirror.com

www.janathamirror.com

Showing posts with label CA exams in May. Show all posts
Showing posts with label CA exams in May. Show all posts

Saturday, 26 February 2022

CA exams in May

CA Foundation, Intermediate, Final Exam Dates Announced by Chartered Accountants Institute. Foundation‌ course exams will be held on May 23, 25, 27, 29.


Intermediate Course Group-1 exams will be held on May 15, 18, 20, 22 and Group-2 exams will be held on May 24, 26, 28 and 30. Final Course Examinations Group-1 will be held on May 14, 17, 19, 21 and Group-2 examinations will be held on May 23, 25, 27 and 29.


The International Taxation Assessment Test (INTT-AT) will be held on May 14 and 17. No examination will be held on May 16 due to Buddhapurnima. All exams start at 2 p.m.


Centers have been set up in Anantapur, Eluru, Guntur, Kadapa, Kakinada, Kurnool, Nellore, Ongole, Rajahmundry, Srikakulam, Tirupati, Vijayawada, Visakhapatnam and Vijayanagaram for these examinations. In Telangana, centers were set up in Hyderabad, Karimnagar, Khammam, Mahabubnagar, Nalgonda, Nizamabad and Warangal. The tests will be conducted in foreign centers in Abu Dhabi, Bahrain, Doha, Kathmandu and Muscat.


మే లో సీఏ పరీక్షలు

సీఏ ఫౌండేషన్‌, ఇంటర్‌మీడియెట్‌, ఫైనల్‌ పరీక్షల తేదీలను ఛార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ వెల్లడించింది. ఫౌండేషన్‌ కోర్సు పరీక్షలు మే 23, 25, 27, 29 తేదీల్లో ఉంటాయి. 

ఇంటర్‌మీడియెట్‌ కోర్సు గ్రూప్‌-1 పరీక్షలు మే 15, 18, 20, 22 తేదీల్లో,  గ్రూప్‌-2 పరీక్షలు మే 24, 26, 28, 30వ తేదీల్లో నిర్వహిస్తారు. ఫైనల్‌ కోర్స్‌ పరీక్షలు గ్రూప్‌-1 మే 14, 17, 19, 21వ తేదీల్లో, గ్రూప్‌-2 పరీక్షలు మే 23, 25, 27, 29వ తేదీల్లో ఉంటాయి. 

ఇంçర్నేషనల్‌ ట్యాక్సేషన్‌ అసెస్‌మెంట్‌ టెస్ట్‌ (ఐఎన్‌టీటీ-ఏటీ) మే 14, 17వ తేదీల్లో నిర్వహిస్తారు. బుద్ధపూర్ణిమ కారణంగా మే 16వ తేదీన ఎలాంటి పరీక్ష నిర్వహించడం లేదు. అన్ని పరీక్షలూ మధ్యాహ్నం 2 నుంచి ప్రారంభమవుతాయి. 

ఈ పరీక్షల కోసం ఏపీలో అనంతపురం, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలలో కేంద్రాలు ఏర్పాటుచేశారు. తెలంగాణలో హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నల్గొండ, నిజామాబాద్‌, వరంగల్‌లో కేంద్రాలు నెలకొల్పారు. విదేశీ కేంద్రాలైన అబుదాబీ, బహ్రెయిన్‌, దోహా, కాఠ్‌మాండూ, మస్కట్‌లలోనూ ఆయా పరీక్షలు నిర్వహించనున్నారు.


గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-4 పోస్టులను భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటన

 కేసీఆర్ కీలక ప్రకటన 91143 పోస్టుల నోటిఫై 80,039 పోస్టులకు నేడు నోటిఫికేషన్ 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్ హోమ్ శాఖ 18334 విద్...

Labels

  • CA exams in May