janathamirror.com

www.janathamirror.com

Sunday 30 May 2021

పామర్రు శాసనసభ్యులు శ్రీ కైలే అనిల్ కుమార్ ఆధ్వర్యంలో విజయోత్సవం

నేను ఉన్నాను..నేను విన్నాను అంటూ ప్రజలకు భరోసా కల్పించిన యువ ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి

3648 కిలోమీటర్లు ప్రజా సంకల్ప పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను దగ్గరగా చూసి నేను విన్నాను నేను ఉన్నాను 
అంటూ ప్రజలకు భరోసా కల్పించి మాట తప్పని మడమ తిప్పని నేతగా నిలబడి తనతో పాటు 151 మంది ఎమ్మెల్యేలను, 22 మంది ఎం.పీ లను గెలిపించుకొని అఖండ భారతదేశ రాజకీయాలలో సరికొత్త చరిత్రను లిఖించి మేనిఫెస్టో ని చెప్పిన మాట ప్రకారం అమల పరిచి ప్రజల్లో సరికొత్త నాంది పలికి ఆంధ్రప్రదేశ్ నవ యువ ముఖ్యమంత్రిగా వైయస్.జగన్మోహన్ రెడ్డి అనే నేను అంటూ పదవీ ప్రమాణస్వీకారం చేసి, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా తన తండ్రి డాక్టర్ వైయస్ఆర్ గారి కంటే రెండడుగులు ముందుకేసి కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా ప్రజలందరినీ కంటికి రెప్పలా కాపాడుకునే సువర్ణ పరిపాలన అందిస్తూ నేడు రెండేళ్ళు చేసుకుంటున్న సందర్భంగా ఆ మనసున్న మహారాజు మన జగనన్నకు, రాష్ట్ర ప్రజలందరికీ హార్ధిక శుభాకాంక్షలు                        

ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ ఎస్ జగన్ గారు పదవీ బాధ్యతలు చేపట్టి నేటికీ రెండేళ్లు పూర్తయిన సందర్భంగా పామర్రు శాసనసభ్యులు శ్రీ కైలే అనిల్ కుమార్ గారు ఆధ్వర్యంలో నియోజకవర్గ వై.ఎస్.ఆర్.సీ.పీ శ్రేణులు అత్యంత ఆనందోత్సాహాలతో విజయోత్సవం జరుపుకున్నారు...

పామర్రు పార్టీ కార్యాలయం నందు జరిగిన ఈ వేడుకల్లో తొలుత దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన తర్వాత గౌరవ శాసనసభ్యులు శ్రీ కైలే అనిల్ కుమార్ గారు కార్యాలయం ఎదుట పార్టీ జెండా ను ఎగురవేశారు

కోవిడ్ నిబంధలను అనుసరిస్తూ.. భౌతిక దూరం పాటిస్తూ... అత్యంత క్రమశిక్షణతో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ కైలే అనిల్ కుమార్ గారు పాత్రికేయ మిత్రులను ఉద్దేశించి మాట్లాడుతూ....

మనసున్న ముఖ్యమంత్రి.. విశాల హృదయం ఉన్న ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రమాణస్వీకారం చేసి ఈ రోజుకి రెండు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా అందరికీ నమస్కారం....

ఇదే సమయంలో ఇదే రోజున 2 సంవత్సరాల క్రితం మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణస్వీకారం చేయటం... ఈ రెండు సంవత్సరాల కాలంలోనే సుమారుగా ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఒక లక్షా 25 వేల కోట్ల రూపాయలు నేరుగా ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కగానే..అక్కా చెల్లి...అన్నా తమ్ముడు ఇలా నేరుగా వారి అకౌంట్లు లోకి డబ్బు జమ అయ్యేలా...భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా...ఆలోచించని విధంగా మన సీఎం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్ల రూపాయల్ని సరాసరి నేరుగా ముఖ్యమంత్రి గారు నొక్కగానే లబ్ధిదారులు అక్క చెల్లి అన్న తమ్ముడు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లోకి వెళ్లే విధంగా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చెయ్ జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు...

సుమారుగా 14 నెలలు కాలంగా కరోనా మహమ్మారితో ప్రపంచం విలవిలాడుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం అన్ని వర్గాల ప్రజలు కూడా సంతృప్తి గా ఉన్నారని... జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ ఫలాలు అభివృద్ధి ఫలాలు మా గడపకు చేరుతున్నాయని అన్ని వర్గాలు ప్రజలు బహిరంగంగా అంగీకరిస్తున్నారు...

దళారులు లేకుండా.. మధ్యవర్తులు లేకుండా.. జన్మభూమి కమిటీనో.. కర్మభూమి కమిటీనో లేకుండా నేరుగా ముఖ్యమంత్రి గారు ప్రతి బటన్ నొక్కగానే సంక్షేమ పథకాల ఆర్థిక సహాయం నేరుగా మా ఇంటికి వస్తున్నాయని ప్రతీ ఒక్కరూ ఎంతోగానో సంతోషంగా ఉన్నారు...

 రాష్ట్ర ప్రజలందరూ పండుగలు పర్వదినాలు గురించి మర్చిపోయారని... జగనన్న అమ్మ ఒడి ఎప్పుడు వస్తుందో ఆ రోజే పండుగలా.. జగనన్న రైతు భరోసా డబ్బులు ఎప్పుడు వస్తే ఆ రోజే పర్వదినంలా..ఇలా నేతన్న నేస్తం మత్స్యకార భరోసా.. సున్నా వడ్డీలు.. ఆరోగ్యశ్రీ ...విద్యా దీవెన ..ఇలాంటి అనేకానేక పధకాలని ఒక క్యాలెండర్ లాగా ప్రతీ నెలా కూడా పండుగ వాతావరణంలో ప్రజలు ఏ విధమైన సంబరాలు జరుపుకుంటారో అదే విధంగా సీఎం జగన్ గారు వచ్చాక ప్రతీ నెలా ప్రజలందరూ రెండు మూడు పెద్ద పండుగలు జరుపుకుంటున్నారని తెలియజేశారు...

 పంచాయతీ ఎన్నికల నుండి ఇటీవల జరిగిన తిరుపతి ఉపఎన్నికల వరకూ వైఎస్సార్సీపీ జెండా రెపరెపలాడుతూ విజయదుంధుబి మోగించడానికి శ్రీ జగన్ గారి ప్రజా రంజక పాలన కారణమని తెలియజేశారు...

No comments:

గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-4 పోస్టులను భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటన

 కేసీఆర్ కీలక ప్రకటన 91143 పోస్టుల నోటిఫై 80,039 పోస్టులకు నేడు నోటిఫికేషన్ 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్ హోమ్ శాఖ 18334 విద్...