Air gun scuffle in Vikarabad .. Locals complain to police...వికారాబాదులో ఎయిర్ గన్ కలకలం..పోలీసులకు స్థానికుల ఫిర్యాదు.
షేక్ ఫయాజ్ అనే వ్యక్తి మద్యం మత్తులో ఎయిర్ గన్ పట్టుకొని హల్చల్ సృష్టించాడు. వికారాబాద్ డిప్యూటీ తాసిల్దారు సివిల్ సప్లైస్ లో ఫయాజ్ పని చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి మద్యం మత్తులో ఇంటి పక్కన ఉన్న టోనీతో ఫయాజ్ వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది.ఫయాజ్ ఎయిర్ గన్ తీసుకొని వచ్చి కలకలం రేపాడు.గన్‌తో కాల్చి చంపేస్తామంటూ హల్చల్ సృష్టించాడు.దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. షేక్ ఫయాజ్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Comments