ప్రజలందరూ కరోనా నివారణకు సహకరించాలి..sp శ్రీ అమ్మిరెడ్డి
ఈరోజు పట్టణంలోని పలు కూరగాయల మార్కెట్లను సందర్శించిన గుంటూరు అర్బన్ sp శ్రీ అమ్మిరెడ్డి IPS గారు.కర్ఫ్యూ సమయంలో మార్కెట్ల వద్ద రద్దీ ఎక్కువగా ఉంటుంది అనే విషయం SP గారి దృష్టికి వచ్చింది.
నివారణ చర్యలలో భాగంగా రద్దీగా ఉండే మార్కెట్ల వద్ద కోవిడ్ నిబంధనలు గురించి ఆరా తీశారు.
భౌతిక దూరం పాటించేలా మార్కింగ్ చేయాలి ,అదే విధంగా మాస్క్ లు ధరించటం,శానిటైసర్ ఉపయోగించటం వంటి జాగ్రత్తలు పాటించాలి అని సూచించారు.
అదే విధంగా NTR స్టేడియం మరియ ఆరండల్ పేట ప్లై ఓవర్ చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించారు.అకారణంగా తిరిగే వాహనాలను సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు.
రాత్రి సమయాలలో అనుమతి లేకుండా ప్రయాణికులను తరలించే ప్రవైట్ బస్ లపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
ప్రజలందరూ కరోనా కట్టడికి సహకరించాలి అని గుంటూరు అర్బన్ sp శ్రీ అమ్మిరెడ్డి IPS గారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
No comments:
Post a Comment