హబ్‌లతో కనీసం 80 మల్టీ, సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులు
రాష్ట్ర ప్రజలు మెరుగైన వైద్యం కోసం బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఎందుకు వెళ్లాల్సి వస్తోందన్నది ఆలోచించాలి. టెరిషియరీ కేర్ (అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్యం) కోసం వాళ్లు వెళ్తున్నారు. అందువల్ల రాష్ట్రంలో ప్రత్యేకంగా హెల్త్ హబ్‌లు ఏర్పాటు చేయాలి. అన్ని జిల్లా కేంద్రాలు, మూడు కార్పొరేషన్లలో హెల్త్ హబ్‌లు ఏర్పాటు కావాలి. విజయవాడ, తిరుపతి, రాజమండ్రితో కలిపి మొత్తం 16 చోట్ల హెల్త్ హబ్‌లు నెలకొల్పాలి. ఇందుకోసం ఒక్కో చోట కనీసం 30 నుంచి 50 ఎకరాలు సేకరించాలి. ఒక్కో ఆస్పత్రికి 5 ఎకరాలు చొప్పున ఉచితంగా భూమి కేటాయించాలి. మూడేళ్లలో కనీసం రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టే ఆస్పత్రులకు ఆ భూములు ఇవ్వాలి. దీనివల్ల కనీసం 80 మల్టీ, సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులు అందుబాటులోకి వస్తాయి. వీటితో పాటు ప్రభుత్వం తరఫున కొత్తగా మరో 16 వైద్య కళాశాలలు, 16 నర్సింగ్ కాలేజీలు వస్తున్నాయి.
మూడేళ్లలో కనీసం రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చి ఆస్పత్రులు ఏర్పాటు చేస్తే ఉచితంగా 5 ఎకరాలు కేటాయించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. డిమాండ్ ఉండే చోట్ల అవసరం మేరకు అదనంగా భూ సేకరణ చేయాలని సూచించారు. హెల్త్ హబ్‌లపై నెల రోజుల్లో పాలసీ తీసుకురావాలని, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే వ్యాక్సిన్ తయారయ్యేలా చర్యలు చేపట్టి సమగ్ర విధానాన్ని రూపొందించాలని ఆదేశించారు. కోవిడ్ నియంత్రణ, నివారణ, చికిత్స, వ్యాక్సినేషన్, ఆక్సిజన్ సరఫరాపై ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
No comments:
Post a Comment