ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వాలు సిద్ధమైతే ఆపినది చంద్రబాబు కాదా...మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు
చంద్రబాబు జూమ్ యాప్ పెట్టుకుని మహానాడు పేరుతో ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నాడని విమర్శించారు. మహానుభావుడు ఎన్టీఆర్ పుట్టినరోజును గత 25 ఏళ్ళుగా చూస్తూనే ఉన్నానని చెప్పారు. ప్రతి మహానాడులోనూ ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని మొదటగా తీర్మానం చేస్తూనే ఉన్నారని అన్నారు. గతంలో ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వాలు సిద్ధమైతే ఆపిన గాడిద చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. ఇప్పటికీ ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని లక్ష్మీపార్వతి, ఎన్టీఆర్ పిల్లలు, ఎన్టీఆర్ అభిమానులు నేటికీ కోరుతూనే ఉన్నారని,టీడీపీ కూడా దొంగ తీర్మానాలు చేస్తూనే ఉందన్నారు.
ఎన్టీఆర్‌కు భారతరత్న ఇస్తే లక్ష్మీపార్వతి చేతుల మీదుగా దాన్ని అందుకోవాల్సి వస్తుందనే కారణంగా భారతరత్న రాకుండా చంద్రబాబు అడ్డుపడ్డాడన్నారు. అయినా చంద్రబాబుకు సిగ్గు, శరం రాలేదని, ప్రజలేమైనా అనుకుంటారనే ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడన్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు, చనిపోయిన రోజున ఆయన సమాధి దగ్గరకు వెళ్తుంటారన్నారు.
ఎన్టీఆర్ పార్టీని దోచుకున్న దొంగలు, ఆయన పదవిని కొట్టేసిన వెధవలు, లుచ్చాగాళ్ళందరూ ఎన్టీఆర్ ఆశయాలను నెరవేరుస్తామని చెబుతుంటారన్నారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న వీరి ముఖంపై ప్రజలు కాండ్రించి ఉమ్మేసినా సిగ్గు, శరం మాత్రం రావడం లేదన్నారు. తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ ఎన్టీఆర్ కు ద్రోహం చేశారని అన్నారు. అటువంటి ద్రోహులందరూ కలిసి సీఎం జగన్మోహనరెడ్డి పై అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారన్నారు. సీఎం జగన్మోహనరెడ్డికి రాష్ట్రాన్ని పరిపాలించే అనుభవం లేదని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు.
గుంటనక్క చంద్రబాబుకు తిరిగి అధికారాన్ని అప్పజెప్పాలని ప్రజలు కోరుకుంటున్నట్టుగా పనికిమాలిన, పనిలేని సన్నాసులు పది మంది ఊహల్లో బతుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహనరెడ్డికి రాష్ట్ర ప్రజలతో పాటు దేవుడి ఆశీస్సులు ఉన్నాయన్నారు. జగన్మోహనరెడ్డి ఉన్నంత కాలం ముఖ్యమంత్రిగానే ఉండాలని ప్రజలు దీవించాలన్నారు. పిల్లల చదువులు , ఆరోగ్య సమస్యలు వంటివి ఎదురైతే వాటిని సీఎం జగన్మోహనరెడ్డి మాత్రమే నెరవేర్చగలరని ప్రజలు భావిస్తున్నారన్నారు. దేవుడు, ప్రజల ఆశీస్సులతో మరింత మెరుగైన పాలన అందించే అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రజలకు రెండేళ్ళు పూర్తయిన సందర్భంగా చేతులు జోడించి నమస్కరిస్తున్నారనని మంత్రి కొడాలి నాని చెప్పారు.
No comments:
Post a Comment