Laying of foundation stone for Village Secretariat building...గ్రామ సచివాలయ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన
గ్రామ సచివాలయ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన
కంచికచర్ల మండలం :గనిఆత్కూరులో గ్రామ సచివాలయ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా"మొండితోక.జగన్ మోహన్ రావు ...ప్రజా సంక్షేమం ,రాష్ట్ర అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్లు వంటివని నందిగామ ఎమ్మెల్యే డా"మొండితోక.జగన్ మోహన్ రావు పేర్కొన్నారు ..
కంచికచర్ల మండలంలోని గనిఆత్కూరు గ్రామంలో రూ.40 లక్షల నిధుల అంచనా విలువతో నూతనంగా నిర్మించనున్న గ్రామ సచివాలయ భవన నిర్మాణ పనులకు ఆయన అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు ,
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా"జగన్ మోహన్ రావు మాట్లాడుతూ ప్రజలకు పారదర్శక పాలనందిచేందుకే ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి గ్రామ సచివాలయ -వాలంటరీ వ్యవస్థలను రూపొందించారని తెలిపారు ,
అదేవిధంగా గ్రామ స్థాయి లోనే అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు ముఖ్యమంత్రి వైయస్.జగన్ కృషి చేస్తున్నారని ,సచివాలయ సిబ్బంది- వాలంటీర్లు కూడా ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని సూచించారు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ,
ఈ కార్యక్రమంలో అధికారులు ,సచివాలయ సిబ్బంది మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు ..
Comments