ప్రజల కోసమే పనిచేస్తున్న జగన్ - మేనేజ్ చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు
తాడేపల్లి, మే 30: ప్రజా నాయకుడు, సీఎం జగన్మోహనరెడ్డిని విమర్శించే స్థాయి, హక్కు చంద్రబాబుకు లేదని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు.ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కొడాలి నాని విలేఖర్లతో మాట్లాడారు. చంద్రబాబు హాయంలో మేనిఫెస్టో అంటే ఆయన అవసరాలకు అడ్డమైన వాగ్దానాలు చేసి ఎన్నికల తర్వాత దాన్ని ఎక్కడా కనబడకుండా చేసిన పరిస్థితిని ప్రజలంతా చూశారన్నారు. మేనిఫెస్టోను దొంగ పుస్తకంగా ప్రజలనుకునే పరిస్థితికి చంద్రబాబు దిగజార్చారన్నారు. సీఎం జగన్మోహనరెడ్డి మాత్రం మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్ గా భావిస్తానని చెప్పి, దానిలో ఇచ్చిన ప్రతి హామీలను నెరవేర్చుతూ రెండేళ్ళలోనే 95 శాతానికి పైగా అమలు చేశారన్నారు.
మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రజాసంక్షేమ కార్యక్రమాల అమల్లో కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడడం లేదన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ అమ్మ ఒడి, పెన్షన్లు, ఇళ్ళపట్టాల వంటి పథకాలను అందజేస్తున్నారన్నారు. తనకు ఓటు వేశారా, లేదా అనేది ఆలోచన చేయకుండా ప్రజలు మేలు చేయాలన్న ఉద్దేశ్యంతో సీఎం జగన్మోహనరెడ్డి పనిచేస్తున్నారన్నారు. దేవుడిచ్చిన అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించాలనే చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని చెప్పారు.
ఇంకా 30 ఏళ్ళ పాటు రాష్ట్రానికి సీఎంగా జగన్మోహనరెడ్డి ఉండాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారన్నారు. సీఎం జగన్మోహనరెడ్డి రాష్ట్ర ప్రజల , దేవుని ఆశీస్సులతో రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం వల్లే నిత్యం ఆయన ప్రజల గురించి ఆలోచన చేస్తున్నారన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని అధికారంలోకి వచ్చిన నాటి నుండి నెరవేరుస్తున్నారన్నారు. అధికారం చేపట్టిన రెండేళ్ళలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 90 శాతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్ధులు గెల్చారన్నారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తుప్పు, పప్పునాయుడులు ఎన్నికలొదిలి పారిపోయారంటే సీఎం జగన్మోహనరెడ్డికి ప్రజల పట్ల ఉన్న విశ్వసనీయతను అర్ధం చేసుకోవచ్చన్నారు. తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లకు ఒక్క రూపాయి కూడా పంచలేదన్నారు. ప్రజలకిచ్చిన వాగ్దానాలను సీఎం జగన్మోహనరెడ్డి అమలు చేస్తున్నారని, ప్రజలంతా ఆయనతోనే ఉన్నారని నమ్మారని చెప్పారు. అందువల్లే 2019 లో వచ్చిన మెజార్టీ కన్నా ఎక్కువ ఓట్లు లభించాయన్నారు.
కరోనా కారణంగా పోలింగ్ శాతం తక్కువగా నమోదైనప్పటికీ ప్రజల పట్ల సీఎం జగన్ కు ఉన్న నిబద్ధతను అర్ధం చేసుకోవచ్చన్నారు. సీఎం జగన్ చంద్రబాబులా డబ్బా ఛానల్స్, చెత్త పత్రికలను అడ్డం పెట్టుకుని కల్లబొల్లి మాటలు చెప్పి, నమ్మకం ద్రోహం చేసి, వంచించి, వెన్నుపోటు పొడిచి రాజకీయాల్లోకి రాలేదన్నారు. ప్రజలను నమ్ముకుని ప్రజల మధ్య పార్టీ పెట్టి ప్రజలతోనే మమేకమై ఉన్నారని, అందువల్లే జగన్ ఏ ప్రజలైతే గెల్పించారో వారి కోసమే పనిచేస్తున్నారన్నారు.
గతంలో వైశ్రాయ్ హెూటల్ లో క్యాంపులు పెట్టి, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, పేపర్లు, టీవీలు, వ్యవస్థలను మేనేజ్ చేసి, యనమల రామకృష్ణుడు లాంటి స్పీకర్లను అడ్డం పెట్టుకుని చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారన్నారు. ఆయన ఉన్నన్ని రోజులు ఈ డబ్బా ఛానల్స్, బోకు పేపర్ల యాజమాన్యాల కోసం ఊడిగం, బ్రోకర్ పనులు చేస్తూ ఒక ముఖ్యమంత్రిగా కాకుండా బ్రోకర్ గా చంద్రబాబు అందరి సంకలు నాకాడని మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు.
No comments:
Post a Comment