janathamirror.com

www.janathamirror.com

Thursday 3 June 2021

2023 జూన్ నాటికి పేదలందరికీ ఇళ్ళు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యం.. సీఎం శ్రీ వైయస్ జగన్

2023 జూన్ నాటికి 'నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ళు' పూర్తి


ఎన్నికల సందర్భంగా శ్రీ వైయస్ జగన్ ప్రకటించిన మేనిఫెస్టోలో 'నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ళు' అనే హామీని 2023 జూన్‌ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు రాష్ట్రంలో రెండు దశల్లో పేదల కోసం రూ.50,944 కోట్లతో మొత్తం 28,30,227 పక్కాగృహాలను నిర్మించబోతోంది. దీనిలో భాగంగా తొలి విడతలో 15.60 ఇళ్ళు, రెండో విడతలో రూ.22,860 కోట్లతో 12.70 లక్షల ఇళ్ళను నిర్మించనుంది. 

మొదటి దశ ఇళ్ల నిర్మాణం జూన్ 2022 నాటికి, రెండో దశ ఇళ్ళ నిర్మాణాన్ని జూన్ 2023 నాటికి పూర్తి చేయాలని సీఎం శ్రీ వైయస్ జగన్ అధికారులను ఆదేశించారు. మొదటిదశ ఇళ్ళ నిర్మాణంలో 8,905 లేఅవుట్లలో 11.26 లక్షల ఇళ్ళను వైయస్‌ఆర్‌ జగనన్న కాలనీలుగా నిర్మిస్తున్నారు. 

అలాగే  2,92,984 ఇళ్ళను స్వంత స్థలాలు కలిగిన లబ్దిదారులకు, 1,40,465 ఇళ్ళను నివేసిత స్థలాలు కలిగిన లబ్ధిదారులకు కూడా పక్కాగృహాలు మంజూరు చేయడం ద్వారా వాటి నిర్మాణం కూడా ప్రారంభిస్తున్నారు. 


''అవి ఇళ్ళు కావు.. ఊర్లు''

రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదల ఇళ్ళనిర్మాణం కోసం సిద్దం చేసిన లేఅవుట్లు కొత్తగా ఊళ్ళను సృష్టిస్తాయన్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మాటలు నిజమవుతున్నాయి. అవి ఇళ్ళు కాదు.. ఊళ్ళు... ఆ దృష్టితో అక్కడి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని ముందుచూపుతో సీఎం ఇచ్చిన   ఆదేశాలతో కొత్త ఆవాసాలు, అన్ని వసతులతో పురుడుపోసుకుంటున్నాయి. 

ఇందుకోసం కొత్తగా చేపట్టే గృహనిర్మాణ ప్రాంతాల్లో రూ.32,909 కోట్లను ఖర్చు చేస్తోంది. తాగునీటి కోసం రూ.4,128 కోట్లు, రోడ్లు, డ్రైనేజీ కోసం రూ.22,587 కోట్లు, విద్యుత్ సరఫరా కోసం రూ.4,986 కోట్లు, ఇంటర్నెట్ కోసం రూ.627 కోట్లు, ఇతర సౌకర్యాల కోసం రూ.567 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. 

అందమైన కాలనీలు... అన్ని వసతులతో కూడిన ఇళ్ళు

వైయస్‌ఆర్‌ జగనన్న కాలనీలు అన్ని హంగులతో... అందంగా తీర్చిదిద్దడమే కాకుండా... పేదలకు మంజూరు చేసిన ప్రతి ఇల్లు అన్ని సదుపాయాలతో ఉండాలన్న సీఎం శ్రీ వైయస్ జగన్ ఆకాంక్షకు అనుగుణంగా కాలనీలు రూపుదిద్దుకోబోతున్నాయి. ఒకేరకమైన నమూనాతో ప్రతి ఇంటిని 340 చదరపు అడుగులలో  ఒక పడక గది, హాలు, వంటగది, స్నానాలగది, వరండాతో నిర్మిస్తున్నారు. 

No comments:

గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-4 పోస్టులను భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటన

 కేసీఆర్ కీలక ప్రకటన 91143 పోస్టుల నోటిఫై 80,039 పోస్టులకు నేడు నోటిఫికేషన్ 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్ హోమ్ శాఖ 18334 విద్...