janathamirror.com

www.janathamirror.com

Wednesday 2 June 2021

CM Jaganmohan Reddy's work for the progress of the state and the welfare of the people...Minister Kodali Nani

  రాష్ట్ర ప్రగతి, ప్రజల సంక్షేమం కోసం సీఎం జగన్మోహనరెడ్డి కృషి

గుడివాడ, జూన్ 2: రాష్ట్ర ప్రగతి, ప్రజల సంక్షేమం కోసం సీఎం జగన్మోహనరెడ్డి కృషి చేస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. బుధవారం గుడివాడ పట్టణంలోని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి క్యాంప్ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసిన నీలా ఎలక్ట్రానిక్స్ ను మంత్రి కొడాలి నాని ప్రారంభించారు. ముందుగా పాస్టర్ కృపానిధి ప్రార్ధనలు నిర్వహించి దేవుని వాక్యాన్ని అందించారు. 

ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ గుడివాడలో గత 30 ఏళ్ళుగా నీలా ఎలక్ట్రానిక్స్ అధినేత రేవల్లి నీలాకాంత్ హెూమ్ అప్లయెన్స్ సేల్స్ అండ్ సర్వీసింగ్ ద్వారా ఖాతాదారులకు నాణ్యమైన సేవలను అందిస్తూ వస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో క్యాంప్ కార్యాలయం సమీపంలో నీలా ఎలక్ట్రానిక్స్ షోరూంను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ షోరూం ద్వారా మొబైల్ ఫోన్స్ సేల్స్ అండ్ సర్వీస్ ను కూడా అందిస్తున్నారని చెప్పారు. సెల్ ఫోన్ రంగంలో పూర్తి నైపుణ్యం కల్గిన నీలాకాంత్ ను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని సూచించారు. 

ఇదిలా ఉండగా తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సత్యవేడు నియోజకవర్గ ఇన్ ఛార్జిగా వ్యవహరించానని చెప్పారు. ఆ సందర్భంగా 2008 లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన శ్రీసిటీలోని రాక్వర్, రైజింగ్ స్టార్ మొబైల్స్ (ఫ్యాక్స్ కాన్) పరిశ్రమను సందర్శించానని తెలిపారు. ఫ్యాక్స్ కాన్ పరిశ్రమలో రాష్ట్ర నలుమూలలకు చెందిన మహిళా కార్మికులు కూడా పనిచేస్తున్నారని, వీరంతా పెద్దఎత్తున మొబైల్స్ ను తయారు చేస్తున్నారని వివరించారు. శ్రీసిటీలో 28 దేశాలకు చెందిన 190 పరిశ్రమలు ఉన్నాయని, వీటిలో 50 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, 50 శాతం మహిళలకు కేటాయించారని తెలిపారు. గత రెండేళ్ళుగా రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పారు. సులభతర వ్యాపారంలో రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థాయికి సీఎం జగన్మోహనరెడ్డి తీసుకువచ్చారని మంత్రి కొడాలి నాని తెలిపారు. 

అనంతరం మంత్రి కొడాలి నానిని నీలా ఎలక్ట్రానిక్స్ అధినేత రేమల్లి నీలాకాంత్ (పసి), కుటుంబ సభ్యులు మాజీ కౌన్సిలర్ రేమల్లి ప్రబోధారాణి, నిఖిత, పాల్ స్టీవెన్ పుష్పగుచ్ఛాలను అందజేసి దుశ్శాలువాతో ఘనంగా సన్మానించారు. 

ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జి, వైసీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మండలి హనుమంతరావు, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పాలేటి చంటి, నాయకులు వల్లూరుపల్లి సుధాకర్, కసుకుర్తి బాబ్జి, మాదాసు వెంకట లక్ష్మీకుమారి, జ్యోతుల సత్యవేణి, పెనుమూడి రమేష్, రావులకొల్లు సుబ్రహ్మణ్యం, అల్లం రామ్మోహన్, తాళ్ళూరి ప్రశాంత్ రాజ్, బెజవాడ వెంకట రాంప్రసాద్, చుండూరి శేఖర్, కొలుసు నరేంద్ర, గుమ్మడి నాగేంద్ర, వెంపటి సైమన్, తులిమిల్లి యేషయ్య, మట్టా జాన్ విక్టర్, కడియాల గణేష్, సయ్యద్ గఫార్, అద్దేపల్లి పురుషోత్తం, అలంకార్ శేఖర్, అద్దేపల్లి హరిహరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-4 పోస్టులను భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటన

 కేసీఆర్ కీలక ప్రకటన 91143 పోస్టుల నోటిఫై 80,039 పోస్టులకు నేడు నోటిఫికేషన్ 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్ హోమ్ శాఖ 18334 విద్...