సబ్ కలెక్టర్ ప్రతిష్ట మంగైన్ బదిలీ : అంతర్రాష్ట్ర బదిలీ దరఖాస్తు కు ప్రభుత్వం ఆమోదం
నూజివీడు, జూన్, 22 : నూజివీడు సబ్ కలెక్టర్ ప్రతిష్ట మంగైన్ వ్యక్తిగత అభ్యర్ధన మేరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర క్యాడర్ నుండి ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర సర్వీస్ క్యాడర్ కు బదిలీ అయ్యారు. ఈ మేరకు జి.ఓ. నెంబర్ 1072 ద్వారా ప్రతిష్ట మంగైన్ ను రాష్ట్ర సర్వీస్ నుండి రిలీవ్ చేస్తూ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాధ్ దాస్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసారు. 2018 బ్యాచ్ ఐ.ఏ.ఎస్. అధికారి ప్రతిష్ట మంగైన్. పూర్వీకులు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందినప్పటికీ, తల్లితండ్రులు ఢిల్లీ లో ఆ స్థిరపడ్డారు. సివిల్స్ పరీక్షలలో జాతీయస్థాయిలో 50వ ర్యాంక్ లో నిలిచి తన సత్తాను చాటారు. విశాఖపట్నంలో ట్రైనీ కలెక్టర్ గా పనిచేసారు. అనంతరం మొదటి పోస్టింగ్ లో 2020 ఆగష్టు 17వ తేదీన నూజివీడు సబ్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. సుమారు సంవత్సర కాలంలో గ్రామ పంచాయతీ, మునిసిపల్, జిల్లా పరిషత్ ఎన్నికలు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా సమర్థవంతంగా నిర్వహించారు. కోవిడ్ కష్టకాలంలో వైరస్ వ్యాప్తి నియంత్రణ , రోగులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు డివిజన్ లో మరిన్ని కోవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటు చేసేందుకు కృషి చేసారు. అధికారులు, ప్రజా ప్రతినిధులతో సత్సంబంధాలతో డివిజన్ అభివృద్ధికి కృషి చేసారు. పనిచేసింది కొద్దీ రోజులే అయినప్పటికీ పరిపాలనలో తనదైన ముద్రను వేసుకున్నారు ప్రతిష్ట మంగైన్. ఛత్తీస్ ఘడ్ కు చెందిన 2018 బ్యాచ్ ఐ.ఏ.ఎస్. అధికారి సంబిత్ మిశ్రా ను వివాహం చేసుకున్నారు. అనంతరం అంతర్రాష్ట్ర బదిలీ కి దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Please do like and subscribe
No comments:
Post a Comment