janathamirror.com

www.janathamirror.com

Thursday 3 June 2021

Three options for the beneficiary in housing

 గృహనిర్మాణంలో లబ్ధిదారుడికి మూడు ఆప్షన్లు

ప్రభుత్వ చేయూతతో పక్కాగృహం నిర్మించి ఇవ్వాలన్న సీఎం శ్రీ వైయస్ జగన్ లక్ష్యం కార్యరూపం దాలుస్తోంది. ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా... ఎక్కడా కనీవిని ఎరుగని చందంగా... ఒకేసారి 30.76 లక్షల మంది అర్హులైన పేదలకు, అక్కచెల్లెమ్మల పేరుతో ఇళ్లపట్టాలను పంపిణీ చేసిన ఎపి ప్రభుత్వం కొత్త చరిత్రకు శ్రీకారం 

పేదల కోసం ఒకేసారి లక్షల సంఖ్యలో పక్కాగృహాల నిర్మాణానికి మరో ముందడుగు వేస్తోంది. ఇళ్ళ పట్టా పొందిన ప్రతి ఒక్కరు ప్రభుత్వ చేయూతతో సొంత ఇంటిని నిర్మించుకునేందుకు పక్కాగృహాలను కూడా మంజూరు చేసింది. దీనిలో భాగంగా తొలి విడతలో మొత్తం 15,60,227 గృహాల నిర్మాణంకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రూ.28,084 కోట్లను కేటాయించింది.

గృహనిర్మాణంలో లబ్ధిదారుడి నిర్ణయానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ళను నిర్ధిష్ట నమూనాలో నిర్మించుకునే విషయంలో లబ్ధిదారుడు సొంతగా నిర్ణయం తీసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు మూడు ఆప్షన్లను లబ్ధిదారుల ముందు ఉంచింది. దీనిలో...

ఆప్షన్ -1 : ప్రభుత్వం ఇచ్చిన నమూనా ప్రకారం ఇళ్లు నిర్మించుకోవటానికి అవసరమైన నాణ్యమైన నిర్మాణ సామాగ్రిని ప్రభుత్వమే సరఫరా చేసి, లేబర్ చార్జీలకు కూడా డబ్బు ఇస్తుంది. లబ్దిదారులే ఇల్లు నిర్మించుకోవచ్చు.

ఆప్షన్ -2 : ఇంటి నిర్మాణానికి అవసరమైన నిర్మాణ సామాగ్రిని లబ్దిదారులు తామే తెచ్చుకోవచ్చు. తమకు నచ్చిన చోట నుండి కొనుక్కొని ఇల్లు నిర్మించుకోవచ్చు. దశల వారీగా వారి పురోగతిని బట్టి ప్రభుత్వం అక్కచెల్లెమ్మల బ్యాంకుఖాతాలకు చెల్లింపులు చేస్తుంది.

ఆప్షన్ - 3 : లబ్దిదారులు తాము కట్టుకోలేము , ఆ బాధ్యత అంతా ప్రభుత్వమే తీసుకొని కట్టించమంటే, ప్రభుత్వంనిర్దేశించిన నమూన ప్రకారం ఇల్లు నిర్మించేందుకు అవసరమైన నిర్మాణ సామాగ్రిని సరఫరా చేయడంతో పాటు ఇల్లు నిర్మించుకునేందుకు అవసరమైన పూర్తి సహయ సహకారాలు ప్రభుత్వమే అందించి కట్టిస్తుంది.

No comments:

గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-4 పోస్టులను భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటన

 కేసీఆర్ కీలక ప్రకటన 91143 పోస్టుల నోటిఫై 80,039 పోస్టులకు నేడు నోటిఫికేషన్ 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్ హోమ్ శాఖ 18334 విద్...