Amravati, Gudiwada, May 19: State Civil Supplies and Consumer Affairs Minister Kodali Srivenkateswara Rao (Nani) has said that all necessary steps have been taken to procure 45 lakh metric tonnes of grain for the 2020-21 harvest season in the state. On Wednesday, Minister Kodali Nani spoke to the media.
During the year 2017-18, 18 lakh 12 thousand 956 metric tonnes of grain was procured from farmers at a cost of Rs. 2,853.64 crore was paid. Also, in the year 2018-19, 27 lakh 52 thousand 702 metric tonnes of grain was purchased and Rs. 4 thousand 838.03 crore was paid and in 2019-20 34 lakh 73 thousand 414 metric tonnes of grain was purchased and Rs. 6 thousand 331.41 crore was paid. So far for the year, 13 lakh 40 thousand 010 metric tonnes of grain has been procured from one lakh 15 thousand 813 farmers and payments of Rs 2,510 crore have been made. It is estimated that 25 lakh metric tonnes of grain will reach the purchasing centers by the 31st of this month.
అమరావతి, గుడివాడ, మే 19: రాష్ట్రంలో 2020-21 సంవత్సర పంట కాలానికి 45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవడం జరిగిందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. బుధవారం మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు.
2017-18 సంవత్సరంలో 18 లక్షల 12 వేల 956 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల దగ్గర నుండి కొనుగోలు చేసి రూ. 2 వేల 853.64 కోట్ల చెల్లించడం జరిగిందన్నారు. అలాగే 2018-19 సంవత్సరంలో 27 లక్షల 52 వేల 702 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.4 వేల 838.03 కోట్ల చెల్లింపులు చేశారని, 2019-20 సంవత్సరంలో 34 లక్షల 73 వేల 414 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.6 వేల 331.41 కోట్లు చెల్లించడం జరిగిందని, 2020-21 సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు ఒక లక్షా 15 వేల 813 మంది రైతుల దగ్గర నుండి 13 లక్షల 40 వేల 010 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.2 వేల 510 కోట్ల చెల్లింపులు చేశామని తెలిపారు. ఈ నెల 31 వ తేదీలోగా 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందనే అంచనాల మేరకు అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు.
No comments:
Post a Comment