janathamirror.com

www.janathamirror.com

Saturday 4 September 2021

వందేళ్ల తర్వాత దేశంలో తొలిసారిగా ఏపీలోనే భూముల సమగ్ర సర్వే చేపట్టిన సీఎం జగన్మోహన్ రెడ్డి- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

  గుడివాడ, సెప్టెంబర్ 4: వందేళ్ల తర్వాత దేశంలో తొలిసారిగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లోనే భూముల సమగ్ర సర్వే చేపట్టినట్టు రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు.

కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గం పరిధిలోని గుడ్లవల్లేరు మండలం అంగలూరు గ్రామంలో జరుగుతున్న 

వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష  పథకం అమల్లో భాగంగా డ్రోన్ ద్వారా చేస్తున్న సర్వే కార్యక్రమాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కే. మాధవిలతతో కలిసి శనివారం మంత్రి కొడాలి నాని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష  పథకంలో భాగంగా గుడివాడ డివిజన్లో మొదటి విడతలో రూరల్ మండలం మెరకగూడెం గ్రామాన్ని  పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారని చెప్పారు. రెండవ విడతలో గుడివాడ డివిజన్లో గుడ్లవల్లేరు,  పామర్రు మండలాలను ఎంపిక చేశారని తెలిపారు. గుడ్లవల్లేరు మండలం అంగలూరు గ్రామంలో జరుగుతున్న డ్రోన్ సర్వే పనులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశామన్నారు. వచ్చే

జూన్‌ 2023 నాటికి సమగ్ర భూసర్వే పూర్తి కావాలని అధికారులను సీఎం సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించినట్లు చెప్పారు. సర్వేను అత్యంత ప్రాధాన్య అంశంగా చేపట్టామన్నారు. అవినీతి రహితంగా, ఆదర్శవంతంగా సర్వే ప్రక్రియ ఉంటుందని తెలిపారు.

సర్వేచేసిన వెంటనే గ్రామాల వారీగా మ్యాపులతో కూడిన రికార్డులను  అప్‌డేట్‌ చేయడం జరుగుతుందన్నారు. భూమి కార్డులను రైతులకు ఇస్తామన్నారు. అనుకున్న సమయంలోగా సర్వేను పూర్తిచేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. సర్వే త్వరితగతిన పూర్తిచేయడానికి అవసరమైన వనరులను సమకూర్చుకుంటున్నామని చెప్పారు. డ్రోన్లు సహా ఇతర టెక్నికల్‌ మెటీరియల్‌ను అవసరమైన మేర కొనుగోలు చేయాలని, సాప్ట్‌వేర్‌ను కూడా సమకూర్చుకోవాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. సర్వేలో పాల్గొంటున్న సిబ్బందికి అత్యుత్తమ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, 

దీనికోసం నిపుణుల సేవలు వినియోగించుకుంటున్నామన్నారు.

ఇంత పెద్ద ఎత్తున చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సిబ్బంది, వారికి తగిన శిక్షణ ఇలా అన్ని అంశాలతో సమగ్రమైన కార్యాచరణ ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నామన్నారు. దేశంలోనే సమగ్ర భూ సర్వే పూర్తి చేసిన తొలి రాష్ట్రంగా ఏపీ  నిలుస్తుందని చెప్పారు. ప్రతి నాలుగు వారాలకు ఒకసారి సంబంధిత విభాగాల అధికారులతో కూడా సమగ్ర సర్వేపై సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్ష చేస్తారని తెలిపారు. సర్వే రాళ్లు కొరత లేకుండా చూడాలని భూగర్భ గనులశాఖ అధికారులను సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి గుడివాడ ఆర్డిఓ ఖాజావలి, గుడ్లవల్లేరు మండలం తాసిల్దార్ కె. ఆంజనేయులు, ఈవోపీఆర్డీ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-4 పోస్టులను భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ ప్రకటన

 కేసీఆర్ కీలక ప్రకటన 91143 పోస్టుల నోటిఫై 80,039 పోస్టులకు నేడు నోటిఫికేషన్ 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్ హోమ్ శాఖ 18334 విద్...