కృష్ణా జిల్లా మచిలీపట్నం :
కొందరు తమ స్వార్థ ప్రయోజనం కోసం, హాస్పిటల్లో పనిచేసే సిబ్బంది. ప్రైవేటు వ్యక్తులు కరోనాకు ఉపయోగించే రెమిడెసివిర్ ఇంజక్షన్లను, అధిక లాభాల కోసం బ్లాక్ మార్కెట్లో విక్రయాలు జరపటం జరుగుతుంది. కొన్ని జిల్లాల్లో రెమిడెసివిల్ ఇంజక్షన్ల విక్రయాలపై కేసులు కూడా నమోదు చేయడం జరిగిం ది. ఇందులో భాగంగా జిల్లాలోని స్పెషల్ బ్రాంచ్, లా అండ్ ఆర్డర్ పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేయడం జరిగిందని, వీరి నిఘా ఆధారంగా ఒక కేసుపై దృష్టి పెట్టగా విజయవాడ ఆంధ్రహాస్పిటల్లో కరోనా రోగులకు ఇచ్చే రెమిడెసివీర్ ఇంజక్షన్లను అక్కడున్న సిబ్బంది పక్కదారి మళ్ళించగా ఎక్కువ లాభాల కోసం బ్లాక్ మార్కెట్లో ఒక్కో ఇంజక్షన్ 30 వేలు, 35 వేలకు అమ్మడం జరుగుతుంది.అందిన సమాచారం మేరకు ఈరోజు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, చిలకలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో చిలకలపూడి పోలీసులు కలసి నిర్వహించిన జాయింట్ ఆపరేషన్లో నలుగురు వ్యక్తులను అరెస్టు చేసారు.,
అందులో ప్రధాన నిందితురాలు రుక్మిణి స్టాఫ్ నర్సుగా ఆంధ్రా ఆసుపత్రి గత 10 సంవత్సరాలుగా పనిచేస్తుందని, ఆమెకు సహాయకుడుగా సాయిబాబు అనే వ్యక్తి అక్కడే పనిచేస్తున్నాడు. 3వ వ్యక్తి పాలపర్తి గోపరాజు ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్టు వర్కర్గా పనిచేస్తున్నాడు. వీరితో పాటు కారు ఓనర్ మోహనరావు లను ఈరోజు అరెస్టు చేయడం జరి గిందని ప్రజలందరికీ తెలియ జేయనది ఏమనగా ఇలా బ్లాక్ మార్కెట్లో రెమిడెసివిర్ . ఇంజక్షన్లను విక్రయించే విషయాలు. మీ దృష్టికి వస్తే వెంటనే పోలీస్, రెవిన్యూ,సంభందిత శాఖల వారికి సమాచారం అందించి బ్లాక్ మార్కెట్ను నియంత్రించాలని, ఆపదలో వున్నవారికి, సామాన్యులకు అందుబాటులో ఉంచేందుకు, కోవిడ్ చికిత్సలో భాగంగా ఎవరికి అవసరమో అట్టి వారికి ప్రభుత్వం వారు అన్ని ఆసుపత్రులలో నిల్వలు వుంచినప్పటికీ కొ ౦దరు అక్రవ ధనార్జన కోసం పక్కదారి పడుతున్నారని, ప్రజలందరూ సహకరించి ఎటువంటి సమాచారం వున్నా వెంటనే తమకు తెలిపాలని యస్సీ కోరారు వీరిపై చిలకలపూ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగిందని, రెమిడెసివిల్ ఇంజక్షన్లకు సంభందించి జిల్లాలో పూర్తి నిఘా ఉంచామని అన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ యస్పీ మలిక గార్ల్, అడిషనల్ యస్పీ సత్యనారాయణ, బందరు డియస్పీ రమేష్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇనస్పెక్టర్ నాగేంద్రకుమార్, చిలకలపూడి సిఐ అంశబాబు, స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment